ఉపాధ్యాయ సంఘాల తో మొక్కుబడి చర్చలు మాత్రమే - TNUS

 ఉపాధ్యాయ సంఘాల తో మొక్కుబడి చర్చలు మాత్రమే  - TNUS

తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం - టి ఎన్ యు ఎస్ #TNUS #MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం #మన్నంశ్రీనివాస్ #తెలుగునాడు #TeluguNadu #తెలుగునాడుఉపాధ్యాయసంఘం #TeluguNaduUpadhyayaSangham #TNUS #టీఎన్‌యూఎస్

ఉపాధ్యాయ సంఘాలు తో ప్రభుత్వం విలీన ఉత్తర్వులు ఇచ్చినప్పటి నుంచి నేటి వరకు పలుమార్లు మొక్కుబడిగా చర్చలు జరిపింది తప్ప ఏమి ఉపయోగం లేకుండా పోయిందని పౌండషన్ స్కూల్స్ లో కనీసం 2  SGT పోస్ట్ లు  పోస్టులు ఉండాలని అన్ని సంఘాలు కోరితే ఒప్పుకోకుండా వేలాది  SGT పోస్టులు మిగులు చూపుతున్నారని, అదే విధం గా ఉన్నత పాఠశాలలలో నమోదు నిమిత్తం లేకుండా HM , PD పోస్ట్ లు ఉంచాలని సంఘాలు కోరినా  ఒప్పుకోలేదని.... 

కేవలం మొక్కు బడి చర్చలు తో పాఠశాలలకి ఉపయోగం లేదని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఒక ప్రకటన లో అభిప్రాయం వెలిబుచ్చింది.

బదిలీ కౌన్సెలింగ్  లలో  8ఏళ్ల సర్వీసు కు బదిలీ అనాది గా

ఉందని...  కానీ నేడు మంత్రి వర్యులు కి అన్ని సంఘాలు బదిలీకి 8  ఏళ్ళుని ఉంచాలని  కోరుతున్నా , ఆ విజ్ఞప్తుల ని  పట్టించుకోకుండా  బదిలీలకి   5 సంవత్సరాలు గరిష్టంగా తీసుకుంటామనడం మొక్కుబడి చర్చలు కి నిదర్శనం అని విమర్శించింది.

పాఠశాలలలో సమాంతరముగా తెలుగు,ఇంగ్లీష్ మీడియం లు ఉంచాలని కోరుతున్నా  బలవంతము గా కేవలం ఇంగ్లీష్  మీడియం  ,  బలవంతపు విలీనము లతో విద్యార్థులు నష్టపోతున్నారని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్ , శ్రీరామ శెట్టి వెంకటేశ్వర్లు , ఆర్ధిక కార్యదర్శి పినాక పాణి ఒక ప్రకటన లో తెలిపారు...

No comments

Powered by Blogger.