వసతులు లేని విలీనం : మన్నం శ్రీనివాస్

 వసతులు లేని విలీనం : మన్నం శ్రీనివాస్
ప్రాధమిక తరగతులు ను ఉన్నత పాఠశాలలలో విలీనం వద్దని అనేక ఇబ్బందులు పడుతున్నామని

విద్యార్థుల తల్లి దండ్రులు , విద్యార్థులు ,మేధావులు , ఉపాధ్యాయ సంఘాలు మొత్తుకుంటున్నా వారి విన్నపాలు పట్టించుకోకుండా విలీనం పై చర్యలు తీసుకున్నారని కానీ

రాష్ట్రం లో అనేక ఉన్నత పాఠశాలలలో విలీనం వలన తరగతి గదులు ,బల్లలు  చాలటం లేదని  ఒక్కో గదిలో రెండు లేదా మూడు తరగతులను కలిపి నేలపై కూర్చో బెట్టాల్సిన పరిస్థితి నెలకొందని , ఇంకొన్ని పాఠశాల లలో స్టోర్ రూమ్ లలో వరండాలలో ,చెట్ల కింద విద్యార్థులని కూర్చోబెట్టాల్సి వస్తుందని వారికి బ్లాక్ బోర్డ్ కూడా లేని పరిస్థితుల్లో తరగతులను నిర్వహించాల్సిన పరిస్థితి ఉందని..అధికారుల వత్తిడి వలన ప్రధానోపాధ్యాయులు వసతులు లేకున్నా విలీన ఉత్తర్వులు పాటించి నెట్టుకొస్తున్నారని కావున వాస్తవ పరిస్థితులు గమనించి మరల వాస్తవ సమాచారం తీసుకొని అలాంటి పాఠశాలలను విలీనం నుంచి తప్పించాలని , *దూరం గా ఉన్న పాఠశాలలకు రవాణా సౌకర్యం* కల్పించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్ ,శ్రీరామ శెట్టి వెంకటేశ్వర్లు వ్యవస్థాపక అధ్యక్ష్యులు ఏ. మోహనరావు , సంఘం ప్రతినిధులు పినాకపాణి , బెంగుళూరు రమేష్, డి.బి.ఎస్. ప్రకాశరావు , మొక్కపాటి రాంబాబు, కే.సాంబశివరెడ్డి , ఎన్. రమణయ్య, ఓబులేష్, తలశిల శ్రీనివాసరావు , నామాల కృష్ణమోహన్ ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు.


No comments

Powered by Blogger.