Salary Cut - పది నిమిషాలు అలస్యమైనాజీతం కట్ - ప్రభుత్వ నిర్ణయం

✍️పది నిమిషాలు అలస్యమైనాజీతం కట్

♦️ప్రభుత్వ నిర్ణయం

♦️ఉదయం 10.10లోగా రావాల్సిందే



🌻ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి

విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం జారీచేసిన తాజా ఆదేశాల ప్రకారం నిర్దేశించిన సమయానికన్నా పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినా జీతంలో కోత పడనుంది. దీంతో ఈ విషయం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ అసంతృప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడా నికి ఉద్యోగులు సిద్దమవుతు న్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడతామని, అవసరమైతేనేరుగా ప్రభుత్వ పెద్దలతోనూచర్చిస్తామని వారు

అంటున్నారు. హాజరుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనే ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ విధానం అమలులోకి వచ్చేలోగా హాజరు పుస్తకాన్ని ఎలా వినియోంచాలన్న దానిపై తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. హాజరు పుస్తకాన్ని సంబంధిత విభాత ఉన్నతాధికారి వద్ద ఉదయం పది నుండి 10.10 గంటల వరకు ఉంచాలని, సిబ్బంది అందరు అక్కడే. వచ్చి సంతకాలు చేయాలని పేర్కొంది. 10.10 తరువాత వచ్చేవారికి లేట్ ముద్ర వేయాలని, ఆ ముద్ర పడిన వారికి జీతాల్లో కోత పెడతామని తెలిపింది. తొలుత ఈ విధానం సిఎఫ్ఎంఎస్ విభాగంలో అమలు

చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే,ఇది చాలా తీవ్రమైన చర్య అన్న అభిప్రాయం

ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది.


No comments

Powered by Blogger.