Nellore TNUS - బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి : టి యన్ యు.ఎస్

 బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి : టి యన్ యు.ఎస్

నెల్లూరు సిటీ : తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం సర్వసభ్య సమావేశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లో నెల్లూరు నందు వెంగళరావు నగర్ లోని నగరపాలక ఉన్నత పాఠశాల  లో చల్లా వెంకటేశ్వర్లు అధ్యక్ష్యతన జరిగినది. ముఖ్య అతిధిగా రాష్ట్ర అధ్యక్షడు మన్నం శ్రీనివాస్ ,ప్రధాన కార్యదర్శి శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు , ఉపాధ్యక్షుడు చెరుకూరి పూర్ణ చంద్రరావు గారు హాజరైనారు. ఈ సందర్భంగా బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని ,  బదిలీల్లో SGT /SA లకు 8 సంవత్సరాల పీరియడ్ ని అమలు చేయాలని ,3,4,5 తరగతులు విలీనం రద్దు చేయాలని మన్నం శ్రీనివాస్ డిమాండ్ చేశారు.సదరు సమావేశం లో నూతన కార్య వర్గ ఎన్నిక జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షులు గా శ్రీ యం. రాంబాబు నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి గా శ్రీ రవీంద్ర లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.  గౌరవ అధ్యక్షులు గా శ్రీ ఎస్. మాల కొండయ్య గారిని, జిల్లా కోశాధికారిగా గా శ్రీ యం. సతీష్ కుమార్ గారిని ఎన్ను కోవడం జరిగింది.

No comments

Powered by Blogger.