CPS సిపిఎస్‌పై తగ్గేదేలే.... చట్టానికి రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు...

  CPS సిపిఎస్‌పై తగ్గేదేలే.... చట్టానికి రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు...


ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఉద్యోగ, ఉపాధ్యాయలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ సిపిఎస్‌ ( కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ సిస్టమ్‌)పై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.

తాజాగా రాష్ట్రంలో సిపిఎస్‌ అమలు కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ఆర్థికశాఖ పరిశీలిస్తోంది, ఆర్థికశాఖ పరిశీలన తరువాత న్యాయశాఖకు బిల్లు ముసాయిదా వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బడ్జెట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ప్రతిపాదించే అవకాశం ఉంది. డాఫ్ట్‌ సిపిఎస్‌ రూల్స్‌ - 2022 పేరిట ఈ కసరత్తు సాగుతోంది. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న సంగతి స్పష్టమవుతోంది. రాష్ట్రంలో 2014 సెప్టెరబర్‌ ఒకటి నురచే సిపిఎస్‌ అమలులోకి వచ్చిరది. అప్పటి నుండి అమలు చేస్తున్నప్పటికీ ఇంతవరకు చట్టబద్దత లేదు. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన జాతీయ పెన్షన్‌ పథకం (ఎన్‌పిఎస్‌)లో భాగంగా రాష్ట్రాల స్థాయిలో సిపిఎస్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఎన్‌పిఎస్‌ అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న ఆదేశాలు, సర్క్యులర్లు ఆధారంగా రాష్ట్రంలో సిపిఎస్‌ను అమలు చేస్తున్నారు. అయితే, ఈ విధానం వల్ల భవిష్యత్తులో న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర స్థాయిలో చట్టం రూపొందించమే మార్గమని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా స్పష్టమైన నిబంధనలు రూపొందించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని చెబుతున్నారు. గత ఎన్నికల ముందు సిపిఎస్‌ రద్దుకు ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత సిపిఎస్‌ రద్దు సాధ్యం కాదని చెబుతున్నారు.

టక్కర్‌ నివేదికలేమయ్యాయి...

సిపిఎస్‌ రద్దుకు సంబరధిరచి గత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌తో అప్పటిి ముఖ్యమంత్రి చంద్రబాబు నియమిరచిన కమిటీ నివేదిక రూపొందించి, జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరిరచి న వెరటనే ఆయనకు సమర్పిరచిరది. ఇరదులో సిపిఎస్‌ రద్దుపై లాభనష్టాలను కూడా వివరిరచారు. అయితే ఈ నివేదిక ప్రస్తుతం బుట్టదాఖలైనట్టే కనిపిస్తోరది.సిపిఎస్‌, ఓపిఎస్‌ మధ్య అరతరాలను వివరిస్తూ టక్కర్‌ చేసిన సిఫార్సులు ప్రస్తుత అధికారులు పక్కన పెట్టేసి, కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేశారు.

No comments

Powered by Blogger.