ఉద్యోగులకు నమ్మక ద్రోహం

 ప్రచురణార్ధం     తేదీ: 27/7/2022

ఉద్యోగుల సొమ్ము తో ఆటలా..?? టి ఎన్ యూ ఎస్

ఉద్యోగుల CPS సొమ్ముని పూచీకత్తు పెట్టి ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం 4203 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకోవడం తోనే ప్రభుత్వం CPS ఉద్యోగులకు నమ్మక ద్రోహం చేసినట్టు అయిందని  తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం  ఒక ప్రకటన తెలిపింది.  

అధికారం లోకి వచ్చిన వారం లో CPS రద్దు చేస్తామని  చెప్పి  GPS ప్రతిపాదన చేయడం ఇప్పుడు ఏకంగా CPS సొమ్ము తనఖా తో అప్పు తేవడం చూస్తే CPS ని రద్దు చేయడానికి లేకుండా కొత్త చిక్కుముడులు వేసినట్లు అయిందని ఇక మొన్నటికి మొన్న ఉద్యోగులు తమ పి ఎఫ్ ఖాతాలలో దాచుకున్న నిధులుని 800 కోట్లు దారి మళ్లించడం ఘోరంగా ఉందని *ఉద్యోగుల సొమ్ముతో , జీవితాలు తో చెలగాటం వద్దు అని* , అనేక మంది ఉద్యోగుల పీఎఫ్, ఏపీజీఎల్, ఎర్న్ లీవ్ లకి సంబంధించిన బిల్లులు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నాయని, దీంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆడ పిల్లల పెళ్లి చేయలేక వాయిదాలు వేసుకుంటున్నారని ... గతం లో ఉద్యోగుల సొమ్ము అప్లికేషన్ పెట్టుకున్న 20 రోజుల్లో వచ్చేవి అని  ఇప్పుడు 1 సంవత్సరం అయినా  ఇవ్వలేకపోవడం దారుణం అని పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీ రామశెట్టి వెంకటేశ్వర్లు ,ఆర్ధిక కార్యదర్శి పినాకాపాణి ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు.

తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం - టి ఎన్ యు ఎస్ #TNUS #MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం #మన్నంశ్రీనివాస్ #తెలుగునాడు #TeluguNadu #తెలుగునాడుఉపాధ్యాయసంఘం #TeluguNaduUpadhyayaSangham #TNUS #టీఎన్‌యూఎస్ #Noble Teachers Association#NTA#నోబుల్ టీచర్స్ అసోసియేషన్

✍️ ఉద్యోగులకు నమ్మక ద్రోహం  : టిఎన్ యుఎస్

🌻 ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

ఉద్యోగులు సిపిఎస్ సొమ్మును పూచీకత్తు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెచ్చుకోవడం సిపిఎస్ ఉద్యోగులకు నమ్మక ద్రోహం చేసిందని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం విమర్శించింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, రామశెట్టి వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సిపిఎస్ ను రద్దు చేయడానికి వీలు లేకుండా కొత్త చిక్కుముడులు వేసినట్లయిందని విమర్శించారు. ఉద్యోగుల పిఎఫ్ రూ.800 కోట్లు దారి మళ్లించడం దారుణమన్నారు. పెండింగులో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు

తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం - టి ఎన్ యు ఎస్ #TNUS #MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం #మన్నంశ్రీనివాస్ #తెలుగునాడు #TeluguNadu #తెలుగునాడుఉపాధ్యాయసంఘం #TeluguNaduUpadhyayaSangham #TNUS #టీఎన్‌యూఎస్ #Noble Teachers Association#NTA#నోబుల్ టీచర్స్ అసోసియేషన్

తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం - టి ఎన్ యు ఎస్ #TNUS #MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం #మన్నంశ్రీనివాస్ #తెలుగునాడు #TeluguNadu #తెలుగునాడుఉపాధ్యాయసంఘం #TeluguNaduUpadhyayaSangham #TNUS #టీఎన్‌యూఎస్ #Noble Teachers Association#NTA#నోబుల్ టీచర్స్ అసోసియేషన్

No comments

Powered by Blogger.